రేవంత్, అసద్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం.. పీసీసీ చీఫ్ తీరు హిట్లర్‌ను తలిపిస్తోందంటూ..

|

Nov 15, 2023 | 12:44 PM

రేవంత్‌రెడ్డి తీరు హిట్లర్‌ను తలపిస్తోందంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఫైరయ్యారు. ముందుగా తమ వస్త్రధారణపై దాడి చేసిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత ముస్లిం సమాజంపై దాడికి దిగాలని చూస్తున్నారని మండిపడ్డారు. హిట్లర్‌ చరిత్రను రేవంత్‌రెడ్డి తిరగరాస్తున్నారన్న అసదుద్దీన్..‌ కాంగ్రెస్‌ హస్తం ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలోనే ఉందన్నారు. గాంధీ భవన్‌ను ఆర్ఎస్ఎస్ చీఫ్ నడిపిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా టీ పీసీసీ చీఫ్‌ టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్‌ ఓవైసీ. రేవంత్‌రెడ్డి తీరు హిట్లర్‌ను తలపిస్తోందంటూ ఫైరయ్యారు. ముందుగా తమ వస్త్రధారణపై దాడి చేసిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత ముస్లిం సమాజంపై దాడికి దిగాలని చూస్తున్నారని మండిపడ్డారు. హిట్లర్‌ చరిత్రను రేవంత్‌రెడ్డి తిరగరాస్తున్నారన్న అసదుద్దీన్..‌ కాంగ్రెస్‌ హస్తం ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలోనే ఉందన్నారు. గాంధీ భవన్‌ను ఆర్ఎస్ఎస్ చీఫ్ నడిపిస్తున్నారని ఆరోపించారు.మోహన్‌ భగవత్‌ కళ్లలో ఆనందం కోసం..
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతలు పోటీచేస్తున్నారని అన్నారు.మా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌-బీజేపీ కలిసి పోటీచేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పోటీ చేసే స్థానాల్లో ఇతర పార్టీలను చిత్తుగా ఓడిస్తామన్నారు. వికారాబాద్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి

Follow us on