Telangana Elections: బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం పక్కా.. మంత్రి ఎర్రబెల్లి ధీమా – Watch Video

|

Nov 18, 2023 | 12:28 PM

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్‌కు మరో రెండు వారాలే మిగిలి ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని పాలకుర్తి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ధీమా వ్యక్తంచేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని పాలకుర్తి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ధీమా వ్యక్తంచేశారు.  పాలకుర్తిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఎర్రబెల్లి- టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎంత మంది నడ్డాలు, మోదీలు వచ్చినా కేసీఆర్‌ మూడుసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం కాకుండా అడ్డుకోలేరని అన్నారు. ఈసారి బీఆర్‌ఎస్‌కు 80 సీట్లు కచ్చితంగా వస్తాయన్నారు.  ఎన్నికలకు సంబంధించి తన సర్వేలు, అంచనాలు ఎప్పుడు తప్పలేదని ఎర్రబెల్లి తెలిపారు.

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్‌కు మరో రెండు వారాలే మిగిలి ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.