Telangana Elections: పొరబాటున కాంగ్రెస్ గెలిస్తే.. గుత్తా సంచలన వ్యాఖ్యలు – Watch Video
పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో అరాచకాలు, మత కల్లోలాలు ఏర్పడుతాయని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో తెలంగాణ భవిష్యత్ అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి నిరోధక పార్టీ, మత కల్లోలాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సెటైర్లు విసిరారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పలు హామీలు గుప్పిస్తున్న కాంగ్రెస్.. ఈ హామీలను ఇప్పటికే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు జాతీయ విధానం లేకపోవడం దురదృష్టకరమన్నారు.
పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో అరాచకాలు, మత కల్లోలాలు ఏర్పడుతాయని గుత్తా ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో తెలంగాణ భవిష్యత్ అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి నిరోధక పార్టీ, మత కల్లోలాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ ధ్వజమెత్తారు.