కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు?.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

| Edited By: Janardhan Veluru

Oct 29, 2023 | 1:36 PM

Telangana Polls 2023: నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. నియోజకవర్గంలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీ9 ప్రతినిధితో మాట్లాడిన ఆయన... సీఎం ఎవరనేది పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఎమ్మెల్యే సీఎం అభ్యర్థే అన్నారు.

రేవంత్ రెడ్డే సీఎం అని డీకే శివకుమార్ చెప్పలేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి అత్యుత్సాహం చూపించారని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. నియోజకవర్గంలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీ9 ప్రతినిధితో మాట్లాడిన ఆయన… సీఎం ఎవరనేది పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఎమ్మెల్యే సీఎం అభ్యర్థే అన్నారు. సీఎం పదవి కన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ముఖ్యమన్నారు ఎంపీ కోమటిరెడ్డి. పరిగిలో డీకే శివకుమార్ ప్రసంగానికి తెలుగు అనువాదం చేసిన మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి కాబోయే సీఎం అంటూ వ్యాఖ్యానించడంపై వివాదం నెలకొనడంతో కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీలా వస్తోందని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో 70 నుంచి 80 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ర్నాటకలో పాలనపై హరీష్‌రావు, కేటీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు అమలు కాలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.

Published on: Oct 29, 2023 12:58 PM