Telangana Elections: ఆ అంశాలను పరిగణలోకి తీసుకుని ఓటు వేయాలి.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Updated on: Nov 28, 2023 | 1:56 PM

ఎన్నికల ప్రచారంలో చివరి రోజు మేడ్చల్ నియోజకవర్గంలో BRS అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. ఘట్కేసర్‌లోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రంతో ముగియనుంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 30న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

ఎన్నికల ప్రచారంలో చివరి రోజు మేడ్చల్ నియోజకవర్గంలో BRS అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. ఘట్కేసర్‌లోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం చౌదరిగుడాలో 650 బైక్‌లతో మల్లారెడ్డి బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలు అభివృధి వైపే ఉన్నారని, ఎన్నికల్లో మళ్లీ BRS ప్రభుత్వమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మల్లారెడ్డి. గత పదేళ్లలో ఎవరు ఏం చేశారో బేరిజు వేసుకుని ఓటు వేయాలని కోరారు. ఓ వైపు కేసీఆర్.. మరో వైపు రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు.

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రంతో ముగియనుంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 30న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.