AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: ప్రచార ఆర్భాటమే తప్ప అభివృద్ధి జరగలేదు.. BRS సర్కారుపై ఫడ్నవీస్ విమర్శనాస్త్రాలు

Telangana Elections: ప్రచార ఆర్భాటమే తప్ప అభివృద్ధి జరగలేదు.. BRS సర్కారుపై ఫడ్నవీస్ విమర్శనాస్త్రాలు

Janardhan Veluru
|

Updated on: Nov 21, 2023 | 3:49 PM

Share

Devendra Fadnavis Election Campaign in Hyderabad: ముషీరాబాద్‌ నియోజకవర్గం దోమలగూడలొ బీజేపీ అభ్యర్ధి పూస రాజు తరపున మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్‌ నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రచారం ఆర్భాటం తప్ప కేసీఆర్‌ వల్ల తెలంగాణలో ఎలాంటి అభివృద్ది జరగలేదంటూ బీఆర్ఎస్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు గెలిపించాలని కోరారు.

Telangana Polls 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార జోరుని బీజేపీ మరింత పెంచింది. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, నితిన్ గడ్కారీ, నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ నియోజకవర్గం దోమలగూడలొ బీజేపీ అభ్యర్ధి పూస రాజు తరపున పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఫడ్నవీస్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్‌ నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రచారం ఆర్భాటం తప్ప కేసీఆర్‌ వల్ల తెలంగాణలో ఎలాంటి అభివృద్ది జరగలేదంటూ బీఆర్ఎస్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు గెలిపించాలని కోరారు.

తెలంగాణలో మాఫియా రాజ్యం: కిషన్ రెడ్డి

తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్‌రెడ్డి. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఎలాంటి లాభం ఉండదని, తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం అన్నారు .అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం అని దీమా వ్యక్తం చేశారు.

ఫడ్నవీస్, కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం..

Published on: Nov 21, 2023 03:48 PM