తెలంగాణ మూడో అసెంబ్లీ మొట్టమొదటి సమావేశం శనివారం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. రాజ్ భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ.. ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశఆలను డిసెంబర్ 14కి వాయిదా వేశారు.
ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ గత సంప్రదాయాలను, నియమాలను తుంగలో తొక్కిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంఐఎంతో ఒప్పందంలో భాగంగానే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించారని విమర్శించారు. ఇందుకు నిరసనగా తాము ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..