Telangana Assembly Live: కృష్ణా, గోదావరి జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. అసెంబ్లీ సమావేశాలు లైవ్
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అమాంతం హీట్ పెరిగింది. అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవాళ మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. హిల్ట్ పాలసీ, కోర్ అర్బన్ ఏరియాపై ఇవాళ చర్చ జరగనుంది.. అలాగే.. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా, గోదావరి జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అమాంతం హీట్ పెరిగింది. అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవాళ మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. హిల్ట్ పాలసీ, కోర్ అర్బన్ ఏరియాపై ఇవాళ చర్చ జరగనుంది.. అలాగే.. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా, గోదావరి జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై వివరణ ఇవ్వనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు మారణ శాసనం రాశారని అధికార పార్టీ ఆరోపిస్తున్నది.. అదే సమయంలో బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఈ సెషన్ మొత్తాన్ని బహిష్కరించింది. స్పీకర్ పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తమకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు సైతం తెలంగాణ భవన్‌లో ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదంతా ఇలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల జల జగడాల పరిష్కారానికి కేంద్రం కమిటీ వేసింది
