నామినేషన్లకు ముహూర్త బలం.. ఆ నాలుగు రోజులే !!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. ఇవాళ్టి నుంచి నవంబర్ 10 వరకు నామినేషన్లు వేయనున్నారు అభ్యర్థులు. నవంబర్ 13న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరి తేదీ నవంబర్ 15. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకునే అభ్యర్థులు నామినేషన్ దాఖలకు కూడా మంచి ముహూర్తం కోసం చూస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. ఇవాళ్టి నుంచి నవంబర్ 10 వరకు నామినేషన్లు వేయనున్నారు అభ్యర్థులు. నవంబర్ 13న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరి తేదీ నవంబర్ 15. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకునే అభ్యర్థులు నామినేషన్ దాఖలకు కూడా మంచి ముహూర్తం కోసం చూస్తున్నారు. ఇన్నాళ్లు సీట్ల కోసం నానా పాట్లు పడ్డారు. ఇప్పుడు నామినేషన్లకు ముహూర్తం కోసం అభ్యర్థులు తిప్పలు పడుతున్నారు. ఏ రోజున నామినేషన్ వేయాలి, ఎప్పుడు ముహూర్తం బాగుంది…అనే విషయాలు తెలుసుకోవడానికి పండితుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు నేతలు. నామినేషన్లు వేయడానికి నవంబర్ 3, 4, 8, 9 తేదీలు బాగున్నాయని పండితులు చెబుతున్నారు. ఆ 4 రోజుల్లో తిథి, నక్షత్ర బలాలు అదుర్స్ అని చెబుతున్నారు. నవంబర్ 3..ఉత్తర నక్షత్రంతో కూడిన శుక్రవారం నాడు మంచి ముహూర్త బలం ఉందిట. దీనికితోడు శుక్రవారం కావడంతో ముస్లిం అభ్యర్థులు కూడా ఆసక్తి చూపే అవకాశం ఉందంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుపై నగ్నంగా తిరుగుతూ.. పోలీసులపైనే దాడి !!
Gaza–Israel conflict: గాజాను పూర్తిగా చుట్టిముట్టేసాం.. నల్లసంచుల్లో శవాలుగా పంపిస్తాం
రిక్టర్ స్కేలుపై 6.3గా తీవ్రతతో మళ్లీ భూకంపం.. ఈసారి ఎక్కడంటే ??