TTD Gold biscuits: శ్రీవారికి తమిళనాడు భక్తుడి భారీ కానుక… రూ.1.83 కోట్ల విలువ గల 3.604 కేజీల బంగారం బిస్కెట్లు..(వీడియో)

|

Nov 05, 2021 | 8:11 AM

తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన భక్తుడు భారీ కానుక అందించారు. కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు తిరుమల శ్రీవారికి 1కోటి 83లక్షల రూపాయల విలువ చేసే...


తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన భక్తుడు భారీ కానుక అందించారు. కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు తిరుమల శ్రీవారికి 1కోటి 83లక్షల రూపాయల విలువ చేసే 3.604 కేజీల బంగారం బిస్కెట్లు కానుకగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో ధర్మారెడ్డికి ఈ విరాళాన్ని అందించారు. ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

కరోనా అనంతరం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే..తిరుమల శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్యను సైతం టీటీడీ పెంచుతూ వస్తోంది. దీంతో రోజుకు సగటున 20 నుంచి 30వేల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. కోవిడ్‌ నిబంధనల మేరకు టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది.

మరిన్ని చదవండి ఇక్కడ: Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Hebah Patel: ఏంజెల్ లా మెరుస్తున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)

little boy cute words: ఈ బుడ్డోడి క్యూట్‌ మాటలు వింటే ఫిదా అవ్వక మానరు..! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో…