Watch Video: సీఎం జగన్‎పై రాళ్ల దాడి.. సీన్ రీ కన్‎స్ట్రక్ట్ చేస్తున్న ప్రత్యేక బృందం..

|

Apr 14, 2024 | 11:46 AM

సీఎం జగన్‎పై రాళ్ల దాడి జరిగిన ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మరోసారి దాడి జరిగిన ప్రదేశాన్ని అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రాత్రి సీఎం జగన్ పై రాళ్లు రువ్విన ఘటనపై సిన్ రీ కంస్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 300 మీటర్ల వరకూ ఎవరినీ అనుమతించడం లేదు. ఘటన స్థలం చుట్టూ అనేక టీంలుగా విడిపోయిన ప్రత్యేక పోలీసు బృందాలు దాడి జరిగిన విధానాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ టీవి రికార్డ్‎లు స్వాధీనం చేసుకుని కంట్రోల్ రూంలో ప్రత్యేక టీం పరిశీలిస్తోంది.

సీఎం జగన్‎పై రాళ్ల దాడి జరిగిన ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మరోసారి దాడి జరిగిన ప్రదేశాన్ని అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రాత్రి సీఎం జగన్ పై రాళ్లు రువ్విన ఘటనపై సీన్ రీ కన్ స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 300 మీటర్ల వరకూ ఎవరినీ అనుమతించడం లేదు. ఘటన స్థలం చుట్టూ అనేక టీంలుగా విడిపోయిన ప్రత్యేక పోలీసు బృందాలు దాడి జరిగిన విధానాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ టీవి రికార్డ్‎లు స్వాధీనం చేసుకుని కంట్రోల్ రూంలో ప్రత్యేక టీం పరిశీలిస్తోంది. ఆగంతకుడిని పట్టుకునే పనిలో తలమునకలై ఉంది. పైగా సీఈసీ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫోన్ వచ్చిన నేపథ్యంలో దర్యాప్తు మరింత వేగం పెరిగింది. ఈ ఘటనపై రేపటిలోపు నివేదిక ఇవ్వాలని ఈసీని కేంద్ర ఎన్నికల కమిషన్ కోరడంతో డ్రోన్స్‎తో ఏరియల్ వ్యూ సేకరణ చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నయి. ఈ ఘటనపై మోదీ కూడా స్పందించి ఇలాంటి చర్యలు జరగడం దారుణమని సానుభూతి తెలిపారు. దీనిపై జగన్ రీ ట్వీట్ చేస్తూ తన ఘటనపై సానుభూతి ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Apr 14, 2024 11:42 AM