ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. KCR రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసిన SIT
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక మలుపు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో విచారించాలన్న అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. నందినగర్‌లోని ఆయన నివాసంలో విచారణకు కొత్త నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయించింది. న్యాయ నిపుణుల సలహా అనంతరం సిట్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో విచారించాలన్న అభ్యర్థనను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తిరస్కరించింది. ఎర్రవల్లిలో విచారణ సాధ్యం కాదని సిట్ స్పష్టం చేసింది. ఈ మేరకు కేసీఆర్‌కు త్వరలోనే మరో నోటీసు జారీ చేయనుంది. సిట్ వర్గాల ప్రకారం, కేసీఆర్ తన అధికారిక చిరునామాను అఫిడవిట్లు, ఎన్నికల ప్రక్రియలలో నందినగర్‌గా పేర్కొన్నారు. దీనిని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిగా సిట్ పరిగణిస్తోంది. అందువల్ల, నందినగర్‌లోని ఆయన నివాసంలో విచారణ జరిపేందుకు సిట్ సుముఖత వ్యక్తం చేసింది. కేసీఆర్ లేవనెత్తిన 160 CrPC నిబంధన, సుప్రీం కోర్టు మార్గదర్శకాలపై న్యాయ నిపుణులతో సిట్ చీఫ్ శ్రీనివాసరావు సంప్రదింపులు జరిపారు. సుదీర్ఘ చర్చల అనంతరం కేసీఆర్ అభ్యర్థనను తోసిపుచ్చాలని నిర్ణయించారు. కొత్త నోటీసు ప్రకారం, కేసీఆర్ నందినగర్‌లో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంద్రుడికి పొంచి ఉన్న ముప్పు.. భూమికి ప్రమాదం?
కదిరి లక్ష్మీనరసింహస్వామి రథానికి తాళ్లరేవు కొబ్బరితాడు
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
యాదగిరిగుట్టలో ఏం జరిగింది.. బంగారు, వెండి డాలర్లు ఎక్కడ?
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా.. వేట చూస్తే మైండ్ బ్లాక్