Telangana: పంచాయతీ ఎన్నికల సిత్రాలు.. భార్య గెలుపు కోసం వెక్కి వెక్కి ఏడ్చిన భర్త..
సిద్దిపేట సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో వినూత్న ఘట్టం చోటు చేసుకుంది. భార్య నాగుల స్రవంతినీ సర్పంచ్ గా గెలిపించాలని, ఆమె భర్త నాగుల ప్రశాంత్ కంటతడి పెట్టారు. గత వైఫల్యాలను గుర్తుచేస్తూ, గ్రామ అభివృద్ధికి హామీ ఇస్తూ ఓటర్లను అభ్యర్థించారు. తండ్రి ఆశయాలు నెరవేరుస్తానని, గ్రామ పంచాయతీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ప్రశాంత్ ఉద్వేగంగా విజ్ఞప్తి చేశారు.
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటు న్నాయి..ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా..ఓటర్ల మనస్సు చూరగోనే ప్రయత్నాలు చేస్తున్నారు పలువురు అభ్యర్థులు.. గతంలో పోటీ చేశాం..కానీ ఓటమి పాలు అయ్యాం..మళ్ళీ అవకాశం వచ్చింది..మీ అందరి ఆశీస్సులు కావాలి అని కంటతడి పెడుతున్నారు పలువురు ఆశావహులు..ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. తన భార్యను సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థి భర్త కంటతడి పెట్టాడు..సర్పంచ్ ఎన్నికల్లో తన భార్యను గెలిపించు కోవడానికి బోరున విలపిస్తూ తన భార్యకు ఓటు వేయాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించాడు..తను గతంలో ఒకసారి సర్పంచ్ గా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయానని,ఇంకోసారి ఎంపిటిసిగా అవకాశం ఇచ్చారని, ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ గా తన భార్యకు అవకాశం వచ్చిందని, మీరంతా పెద్ద మనసుతో గెలిపించాలని గ్రామస్తులతో ప్రచారంలో పాల్గొంటూ కంటతడి పెట్టాడు నాగుల ప్రశాంత్ అనే వ్యక్తి…సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లిలో సర్పంచ్ పదవి బీసీ మహిళ రిజర్వేషన్ కాగా, నాగుల ప్రశాంత్ తన భార్య నాగుల స్రవంతినీ గెలిపించాలని బోరున విలపించారు…ఇటీవల తన తండ్రి మరణించాడని అతను ఉంటే మీకు అండగా ఉండేవాడని, అతని లాగే నేను కూడా మీకు అండగా ఉంటానని,తన భార్యకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామ పంచాయతీనీ అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందు వరసలో ఉంచుతాను అని, గ్రామస్థులకు అన్ని విధాల అండగా ఉంటానని ఓటర్లను అభ్యర్థించారు..అంతకుముందు ఆయన గ్రామంలో బారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు…
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: వారణాసి సినిమా షూట్‌కు బ్రేక్.. కారణం..
TOP 9 ET News: ఫస్ట్ డేనే లీక్.. ఎంత కష్టపడి ఏం లాభం సందీపా
Sri Lanka: దిత్వా ధాటికి లంక అతలాకుతలం కన్నీరు పెట్టిస్తున్నదృశ్యాలు
పదే పదే గోరువెచ్చని నీరు తాగుతున్నారా ?? జాగ్రత్త
Health Tips: శనగలు, బెల్లం కలిపి తింటున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి