News Watch LIVE : జోడోలో జోడు హైలెట్‌! 07-10-2022 – TV9

Edited By: Ravi Kiran

Updated on: Oct 07, 2022 | 9:19 AM

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఇండియా జోడో యాత్ర ఈ రోజుల్లో మీడియా ముఖ్యాంశాల్లో నిలిచింది. గురువారం (అక్టోబర్ 6) కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా యాత్రలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఇండియా జోడో యాత్ర ఈ రోజుల్లో మీడియా ముఖ్యాంశాల్లో నిలిచింది. గురువారం (అక్టోబర్ 6) కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా యాత్రలో పాల్గొన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగే ఈ యాత్ర ప్రస్తుతం కర్ణాటకకు చేరుకుంది. గురువారం పర్యటనలో రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీతో కలిసి కనిపించారు. కర్నాటకలో పాదయాత్రలో ఉన్న రాహుల్‌గాంధీని కలిసేందుకు వచ్చారు సోనియా. కొడుకుతోపాటు అడుగు ముందుకేశారు. కాసేపటికి తల్లి నడకలో ఇబ్బందిని గమనించారు రాహుల్‌. వెంటనే కిందికి వంగి సోనియా కాలికి ఉన్న షూ లేస్‌ను సరిగ్గా కట్టారు.

Published on: Oct 07, 2022 08:11 AM