PM Modi Hyderabad Tour: తెలంగాణలో ప్రధాన మోదీ పర్యటన ఖరారు.. డేట్ తో సహా సమాచారం.. వీడియో.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు పలు
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా, ఈనెల 19వ తేదీనే ఆయన తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. జనవరి 19న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్ ప్రారంభం, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా.. ఆ కార్యక్రమాలను రద్దు చేసి షెడ్యూల్ మార్చారు. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్‌ని సంక్రాంతి సందర్భంగా జనవరి 15వ తేదీన వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పుడు ఫిబ్రవరి 13న ఆయన తెలంగాణలో పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను పీఎంవో ప్రకటించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..