PM Modi: రాజ్యాంగం అంటే అంత గౌరవం మాకు.. జహీరాబాద్ సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
మండేఎండను సైతం లెక్కచేయకుండా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు ప్రధాని మోదీ. వరుస ప్రచార సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ గడ్డపై మరోసారి అడుగుపెట్టారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
మండేఎండను సైతం లెక్కచేయకుండా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు ప్రధాని మోదీ. వరుస ప్రచార సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ గడ్డపై మరోసారి అడుగుపెట్టారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అత్యధిక ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా ఇవాళ మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. జహీరాబాద్ లో జరిగే బీజేపీ సభలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానన్నారు. అంబారీపై రాజ్యాంగం వెళ్తుంటే నేను నడుచుకుంటూ వెళ్లా.. రాజ్యాంగం అంటే అంత గౌరవం మాకు.. నా తుదిశ్వాస వరకు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అంటూ మోదీ అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Apr 30, 2024 04:19 PM