Andhra: రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ముద్రగడను కలిసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ..
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశం కావడం ఆసక్తి రేపింది. గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన ముద్రగడ ఇటీవలే డిశ్చార్చ్ అయ్యారు. ప్రస్తుతం కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. ముద్రగడను కలిసి పరామర్శించారు వర్మ.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశం కావడం ఆసక్తి రేపింది. గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన ముద్రగడ ఇటీవలే డిశ్చార్చ్ అయ్యారు. ప్రస్తుతం కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. ముద్రగడను కలిసి పరామర్శించారు వర్మ. ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ కుమారుడు గిరి, ఆయన అనుచరులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఇక.. ముద్రగడ చేయిపట్టుకుని బయటకు వచ్చిన వర్మ.. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. స్థానికంగా, రాజకీయంగా ఇద్దరి మధ్య మంచి పరిచయాలు ఉండడంతోనే ముద్రగడను కలవడానికి వచ్చానన్నారు వర్మ. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.
Published on: Sep 10, 2025 09:58 AM