Pawan Kalyan: Ambati Rambabu: పెళ్లి విషయంలో పవన్ వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ – Watch Video

|

Feb 29, 2024 | 6:55 PM

AP Elections 2024: ఏపీ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. తాడేపల్లి గూడెంలో టీడీపీ జనసేన సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాటల తూటాలు పేలుతున్నాయి. పవన్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

ఏపీ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. తాడేపల్లి గూడెంలో టీడీపీ జనసేన సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాటల తూటాలు పేలుతున్నాయి. పవన్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. పెళ్లి విషయంలో తనపై చేస్తున్న విమర్శలకు పవన్ కౌంటర్ ఇస్తే.. అదే రేంజ్‌లో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఇంతకీ పవన్ కల్యాణ్ ఏమన్నారు..? మరి దానిపై అంబటి రాంబాబు ఏమని స్పందించారో? ఈ వీడియోలో చూడండి..

కాగా తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన జెండా సభపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు చేశారు. తాడేపల్లిగూడెం సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. పవర్ స్టార్ అని చంద్రబాబు పొగిడారు కానీ.. పవర్ షేరింగ్ గురించి మాట్లాడలేదన్నారు. తనకు బలం లేదు, 24 సీట్లే ఎక్కువ అని చెప్పే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా? అంటూ ఎద్దేవా చేశారు. పవన్ రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి కాదన్న అంబటి.. టీడీపీ, జనసేన పొత్తు జీరోనే అవుతుందన్నారు.

Published on: Feb 29, 2024 06:50 PM