News Watch: పట్టపగలు దారుణ హత్యలు..చిన్నారుల మనసులపై ఎఫెక్ట్‌.! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

|

Jan 23, 2023 | 7:39 AM

సాయంత్రం వేళ.. అందరూ చూస్తుండగా.. జరిగిన దారుణ హత్య భాగ్యనగరం హైదరాబాద్ ఉలిక్కిపడింది. ఓ వ్యక్తిని టార్గెట్ చేసిన ముగ్గురు వ్యక్తులు.. అత్యంత విచక్షణ రహితంగా కత్తితో నరికి చంపేశారు.


సాయంత్రం వేళ.. అందరూ చూస్తుండగా.. జరిగిన దారుణ హత్య భాగ్యనగరం హైదరాబాద్ ఉలిక్కిపడింది. ఓ వ్యక్తిని టార్గెట్ చేసిన ముగ్గురు వ్యక్తులు.. అత్యంత విచక్షణ రహితంగా కత్తితో నరికి చంపేశారు. కత్తులు, వేట కొడవళ్లతో దాడి చేశారు. బాధితుడు పరిగెడుతున్నా.. ఆగకుండా వెంబడించి మరీ హత్య చేశారు. పురానాపూల్‌ సమీపంలోని జియాగూడ బైపాస్‌ రోడ్డు వద్ద జరిగిన ఈ దారణ హత్యోదంతంతో నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న కుల్సుంపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్పాట్ ను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధార్‌ కార్డు ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.కాగా.. మృతి చెందిన వ్యక్తి కోఠి ఇస్తామియా బజార్‌కు చెందిన జంగం సాయినాథ్‌ గా గుర్తించారు. అయితే.. నిందితులు ఎవరు? ఎందుకు అతన్ని హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. హత్య జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి దూరం నుంచి వీడియో తీశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 23, 2023 07:39 AM