Watch Video: నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం.. తండ్రితో కలిసి దేవాన్ష్‌ పరుగులు

|

Dec 11, 2023 | 4:37 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 3000 కిలో మీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా పాల్గొన్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 3000 కిలో మీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తండ్రి లోకేశ్‌తో కలిసి దేవాన్ష్ పరుగులు పెడుతూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.