AP News: “సీఎం జగన్ పై దాడి చేసింది రాయితో కాదు…ఎయిర్ గన్‌తో”
సీఎం జగన్ పై రాయితో దాడి జరగలేదని.. ఎయిర్ గన్ తో దాడి చేసినట్లు తెలుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎయిర్ గన్ కు సంబంధించిన పెల్లెట్ వచ్చి జగన్ కంటి పైన తగిలినట్లు చెబుతున్నారు. సీఎం జగన్ పై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
జగన్‌పై దాడి నేపథ్యంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై జరిగింది రాళ్ల దాడి కాదని.. ఎయిర్ గన్‌తో కాల్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. జగన్ కణతకు గురిపెట్టి కాల్చినట్లు పేర్కొన్నారు. పెద్ద ప్రమాదానికి ప్లాన్ వేశారు, అదృష్టవశాత్తు జగన్ బయటపడినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్షాలు చేసిన కుట్ర ఇది అని అంటున్నారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్..
జగన్‌పై ఎటాక్ తర్వాత.. భద్రత మరింత పెంచారు పోలీసులు. కేసరపల్లి క్యాంప్ దగ్గరకు పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. డీజీ, ఎస్పీ ర్యాంక్ పోలీసులతో పాటు.. సీఐలు, ఎస్‌ఐలను మోహరించారు. జగన్‌ను కలిసేందుకు వస్తున్న వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రోజూ.. ఆయన వెంట ఉండే కాన్వాయ్‌ను సైతం.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ఇంటెలిజెన్స్ డీజీ కూడా.. జగన్ రెస్ట్ తీసుకుంటున్న.. కేసరపల్లి క్యాంప్‌కు చేరుకున్నారు. ఎటాక్ సమయంలో.. జగన్ వెంట ఉన్న వారి నుంచి వివరాలు సేకరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..