కేంద్రంలో ఉంది మీరే కదా.. శ్రీధర్‌ బాబు వర్సెస్ పాయల్ శంకర్..

Edited By:

Updated on: Aug 31, 2025 | 2:44 PM

9వ షెడ్యూల్‌లో బీసీ బిల్లు చేర్చే ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ సూచించారని అన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు.. ఆ పని చేయాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమేనని.. కానీ బీసీ బిల్లును అడ్డుకునేలా బీజేపీ సభ్యులు వ్యవహరిస్తున్నారన్న శ్రీధర్‌ బాబు వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ కౌంటర్ ఇచ్చారు.

9వ షెడ్యూల్‌లో బీసీ బిల్లు చేర్చే ప్రయత్నం చేయాలని గంగుల అన్నారని.. ఆ పని చేయాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే అంటూ శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. బీసీ బిల్లును సమర్థిస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చెప్పాలన్నారు. బీసీ బిల్లును అడ్డుకునేలా బీజేపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని.. శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అయితే.. బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్‌కు చిత్త శుద్ధి లేదని పాయల్ శంకర్‌ పేర్కొన్నారు. బీసీ బిల్లు ఆమోదించడంలేదనే నింద బీజేపీపై వేస్తున్నారని.. కాంగ్రెస్‌ ఇలా నిందలు వేస్తుందని గతంలో బిల్లు పెట్టినప్పుడే చెప్పామని పాయల్‌ శంకర్‌ వివరించారు.

Published on: Aug 31, 2025 11:38 AM