Chiranjeevi: కూటమి అభ్యర్థులకు చిరంజీవి సపోర్ట్.. ఓటు వేయండంటూ..! వీడియో వైరల్

|

Apr 21, 2024 | 11:10 AM

సుదీర్ఘ కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయ తెరపైకి వచ్చారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో కాకుండా తన తమ్ముడు పవన్ కళ్యాణ్‎కు మద్దతు తెలుపుతూ ఒక వీడియో చేశారు. ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడటం మంచి పరిణామమన్నారు. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం తన చిరకాల మిత్రుడు సీఎం రమేష్, పంచగళ్ల రమేష్ అని చెప్పారు.

సుదీర్ఘ కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయ తెరపైకి వచ్చారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో కాకుండా తన తమ్ముడు పవన్ కళ్యాణ్‎కు మద్దతు తెలుపుతూ ఒక వీడియో చేశారు. ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడటం మంచి పరిణామమన్నారు. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం తన చిరకాల మిత్రుడు సీఎం రమేష్, పంచగళ్ల రమేష్ అని చెప్పారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్, అదే పార్లమెంట్ పరిధిలోని పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంచగళ్ల రమేష్ పోటీ చేయడం నిజంగా చాల సంతోషంగా ఉందన్నారు. వీరిని గెలిపించడం వల్ల ఆయా నియోజకవర్గాలు మంచి అభివృద్దిని సాధిస్తాయన్నారు. వీటితో పాటు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని శాసనసభ స్థానాల అభివృద్దికి ఎంతగానో దోహదపడతారని చెప్పారు. దానిపై పూర్తి విశ్వాసం, నమ్మకం తనకు ఉందని తెలిపారు చిరంజీవి. ఈ పార్లమెంట్ పరిధిలోని ప్రజలు కూడా వీరిద్దరిపై నమ్మకం ఉంచి గెలిపించమని, ఆశీసులు వీరికి అందించమని ఈ వీడియోలో కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Apr 21, 2024 10:36 AM