నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
మహారాష్ట్ర ఎమ్మెల్యే రామ్ కదమ్ తన నియోజకవర్గం ఘట్కోపర్‌లోని ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరించే వరకు క్షవరం చేయించుకోనని నాలుగేళ్ల క్రితం శపథం చేశారు. పర్వత ప్రాంతాల్లోని ప్రజల కష్టాలను తీర్చడానికి అలుపెరగని ప్రయత్నం చేసి, 2 కోట్ల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్ పనులు ప్రారంభించడంతో ఆయన శపథం నెరవేరింది. తద్వారా నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హెయిర్ కట్ చేయించుకున్నారు. ఇది ప్రజల పట్ల ఆయన నిబద్ధతకు, అంకితభావానికి నిదర్శనం.
అపర భగీరథుడు అని చెప్పలేం కానీ.. ఓ ఎమ్మెల్యే శపథం చేసి మరీ తన నియోజకవర్గంలోని ప్రజల నీటి కష్టాలు తీర్చారు. తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజల కష్టాలు చూసి చలించిపోయిన ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి తాగునీరు తెచ్చేవరకూ తాను క్షవరం చేయించుకోనని ప్రామిస్ చేశారు. ఇందుకోసం నాలుగేళ్లుగా అలుపెరగని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్, దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గురువారం హెయిర్ కట్ చేయించుకున్నారు. తన నియోజకవర్గంలోని ప్రజల నీటి కష్టాలు తీరే వరకు జుట్టు కత్తిరించుకోనని ఆయన చేసిన శపథం నెరవేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రామ్ కదమ్ ముంబైలోని ఘట్కోపర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు కొండలు, గుట్టలతో నిండి ఉండటంతో మంచినీటి సరఫరా తీవ్ర సమస్యగా మారింది. ప్రజల ఇబ్బందులను చూసి చలించిన ఆయన, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు కటింగ్ చేయించుకోబోనని నాలుగేళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. కొండ ప్రాంతాల్లోని ప్రజల కోసం 2 కోట్ల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకులు నిర్మించాలని, వాటికి భందూప్ నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆయన ప్రయత్నాలు ఫలించి, ప్రభుత్వం వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులను తాజాగా ప్రారంభించింది. పనులు మొదలవడంతో ఆయన తన శపథాన్ని విరమించుకున్నారు. ఈ సందర్భంగా రామ్ కదమ్ .. “ఐదేళ్ల క్రితమే ఈ సమస్య పరిష్కారం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఇప్పుడు 2 కోట్ల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకుల నిర్మాణం, భందూప్ నుంచి పైప్‌లైన్ పనులు మొదలవడం సంతోషంగా ఉంది” అని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!
గర్భిణీ శవాన్ని ఊర్లోకి రాకుండా అడ్డుకున్న గ్రామ పెద్దలు.. ఎందుకంటే
అరుదైన దృశ్యం.. సౌదీ ఎడారిలో మంచు.. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో
అండమాన్ నికోబార్ దీవులకు.. పేర్లు పెట్టే ఛాన్స్
ఏపీలో కేరళ తరహా టూరిజం.. లగ్జరీ బోట్లలో లాహిరి లాహిరి లాహిరిలో