గ్యాస్ సంక్షోభంపై తమిళ సర్కార్ ‘మాస్టర్ ప్లాన్’

Updated on: Mar 16, 2026 | 5:23 PM

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా దేశంలో తీవ్ర వంటగ్యాస్ సంక్షోభం నెలకొంది, ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్‌పీజీకి బదులు ఎలక్ట్రిక్ స్టౌవ్‌లు వాడే వాణిజ్య సంస్థలకు ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూ.2 సబ్సిడీని ప్రకటించారు. గ్యాస్ కొరత తగ్గే వరకు ఈ రాయితీ వర్తిస్తుంది, ఇది ఖర్చులను తగ్గించి, ఆహార తయారీ కేంద్రాలకు పెద్ద ఊరటనిస్తుంది.

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు దేశంలో వంటగ్యాస్ సంక్షోభానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల కొరతతో పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్‌పీజీ వినియోగాన్ని తగ్గించి, విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా సంచలన రాయితీని ప్రకటించారు. రాష్ట్రంలోని టీస్టాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మరియు క్లౌడ్ కిచెన్ నిర్వాహకులు ఎల్‌పీజీ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టౌవ్‌లను వాడితే, వారు వినియోగించే ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూ. 2 సబ్సిడీ అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్యాస్ కొరత తీవ్రత తగ్గే వరకు ఈ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడం, స్టాక్ అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న ఆహార తయారీ కేంద్రాలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. విద్యుత్ స్టౌవ్‌ల వైపు మారడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా, గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని అధికారులు వెల్లడించారు. దేశంలోనే గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇలాంటి వినూత్న నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tirupati: నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!

పల్టీ కొట్టిన సిలిండర్ల లారీ.. చెల్లాచెదురుగా గ్యాస్ బండలు!

పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ..

Hyderabad: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై.. సమాజం ఎటుపోతుందో

Indiramma Illu: ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Follow Us