Revanth Reddy vs KTR: కేటీఆర్ – రేవంత్ మధ్య లీగల్ నోటీసులు వార్.. వీడియో.
తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అటు బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న టీఎస్‌పీఎస్పీ పేపర్ లీకేజీ, టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీల వ్యవహారం తారాస్థాయికి చేరుకుంటున్నాయి.
తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అటు బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న టీఎస్‌పీఎస్పీ పేపర్ లీకేజీ, టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీల వ్యవహారం తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇలా రోజులో అంశంపై తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు జోరందుకుంటున్నాయి. అయితే టీఎస్‌పీఎస్పీ, టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ వ్యవహారంతో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా.. కొన్నాళ్లుగా మంత్రి కేటీఆర్- టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్‌తోపాటు ఆయన పీఏ హస్తముందనే ఆరోపణలతో ఆయన గరమయ్యారు. ఈ క్రమంలోనే.. గత నెల 28న రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. టీఎస్‌పీఎస్సీ విషయంలో రేవంత్‌రెడ్డి.. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారంలోకి తరచూ తన పేరు లాగుతున్నారని లీగల్ నోటీసులు ఇచ్చారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని.. లేని పక్షంలో 100కోట్ల పరువు నష్టం దావా వేస్తానంటూ కేటీఆర్ నోటీసులు పంపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..