KTR Pressmeet: కొత్త ప్రభుత్వాన్ని తొందరపెట్టం.. వాళ్లు కుదురుకోవాలి.. పనిచేయాలి: కేటీఆర్
తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ముందుకు వచ్చారు. లైవ్ చూద్దాం....
తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ముందుకు వచ్చారు. గతం కన్నా మంచి మెజార్టీ సాధిస్తామనుకున్నాం కానీ ఆశించిన ఫలితం రాలేదన్నారు. సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. వంద శాతం ప్రజల పక్షాన నిలుస్తామన్నారు కేటీఆర్. అడుగడుగునా అండగా నిలబడ్డ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులు చూశాం.. ఎన్నికల ఫలితాలు నిరాశపరిచినా, బాధపడటం లేదన్నారు. బీఆర్‌ఎస్‌కు ఈ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు. గెలిచిన కాంగ్రెస్‌కు అభినందనలు తెలిపిన కేటీఆర్.. కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నేతలు నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :
తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్ :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :