నీ డబ్బేం వద్దు విజయ్‌.. నా సోదరిని నాకివ్వు

Updated on: Sep 30, 2025 | 6:00 PM

కరూర్‌లో టీవీకే అధ్యక్షుడు విజయ్‌ ప్రచారసభలో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినవారిలో ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. తరచిచూస్తే గుండెల్ని పిండేస్తాయి. ఇద్దరు బిడ్డలు సహా ప్రాణాలు కోల్పోయిన మహిళ, పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్న జంట (ఆకాశ్‌ గోకులశ్రీ), చట్టిబిడ్డను కోల్పోయిన బధిర తల్లి ఇలా పలువురు జీవితాలు కనిపిస్తాయి.

విజయ్‌ను చూసేందుకు తన ఇద్దరు పిల్లలు సాయిలక్ష్మి(8), సాయిజీవ (4)తో వచ్చిన హేమలత (30) రద్దీలో చిక్కుకుంది. ఇద్దరు పిల్లలు సహా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులను శోకసముద్రంలోకి నెట్టింది. ఆ కుటుంబానికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. దుర్ఘటన జరిగిన వేలుసామిపురంలోని వడివేల్‌ వీధికి చెందిన విమల్‌ భార్య మాదేశ్వరి బధిరురాలు. ఈ దంపతుల కుమారుడు ధ్రువ్‌ విష్ణుకు వచ్చేనెల రెండో సంవత్సరం పుట్టినరోజు వేడుక జరగాల్సి ఉంది. విజయ్‌ను చూసేందుకు ఆ బిడ్డను తీసుకొని మేనత్త ప్రచారసభకు వచ్చింది. తొక్కిసలాటలో ఈ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. మేనత్త ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బిడ్డ మృతదేహం కోసం ఆస్పత్రికి వచ్చిన మాదేశ్వరి కడుపుకోతతో ఏడవటం అక్కడివారి కళ్లను చెమర్చేలా చేసింది. అదే వేలుసామిపురానికి చెందిన ఆకాశ్‌ (24), గోకులశ్రీ (24)లకు కొన్ని నెలల కిందట నిశ్చితార్థం జరగగా అక్టోబరులో పెళ్లి కావాల్సి ఉంది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు వచ్చిన ఈ జంట కూడా తొక్కిసలాటలో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకుంది. ఇక కరూర్‌ విజయ్‌ సభలో శనివారం సాయంత్రం సమయంలో తొక్కిసలాట జరిగినట్లు వార్తలు రావడంతో బృందకు ఆమె సోదరి ఫోన్‌ చేస్తూనే ఉంది. అట్నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆదివారం ఉదయమే బృంద మరణించినట్లు తమకు సమాచారం అందినట్లు ఆమె సోదరి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సందర్భంగా తొక్కిసలాటలో మరణించిన బాధిత కుటుంబానికి విజయ్‌ రూ.20లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల సహాయం ప్రకటించారు. ఆ మొత్తం మాకెందుకు. చనిపోయిన నా సోదరిని ఇవ్వండి చాలు అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బృంద సోదరి చూపరులను కంటతడి పెట్టిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నవరాత్రుల శుభవేళ ఆలయంలో అద్భుతం

రోడ్డు మధ్యలో క్షుద్రపూజలు.. భయాందోళనలో స్థానికులు

ఛీ !! విజయ్‌ తీరుపై కట్టప్ప షాకింగ్ రియాక్షన్

‘ చెప్పాల్సింది చెప్పేశా. ఇంకేమీ లేదు’

నిద్రిస్తుండగా ఘోర ప్రమాదం !! వీర హనుమాన్ చైల్డ్‌ ఆర్టిస్ట్ మృతి