KTR చెప్పినట్టే CM రేవంత్ లో రాము.. రెమో ఇద్దరూ ఉన్నారు

Edited By: Phani CH

Updated on: Nov 26, 2025 | 7:40 PM

మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రామగుండం, పాల్వంచ, మక్తల్ పవర్ ప్లాంట్లలో వేల కోట్ల కమిషన్లు వస్తున్నాయని, విద్యుత్ ప్రాజెక్టులలో భారీ అవినీతి జరిగిందని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గతంలో థర్మల్ ప్లాంట్లను వ్యతిరేకించి, ఇప్పుడు మద్దతు పలకడం కమిషన్ల కోసమేనని, ఆయన మాట మార్చే వ్యక్తి అని హరీష్ రావు విమర్శించారు.

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో జరుగుతున్న అవినీతిపై ఆయన మండిపడ్డారు. రామగుండం, పాల్వంచ, మక్తల్ పవర్ ప్లాంట్లలో మెగావాట్‌కు 14 కోట్ల రూపాయల మేర వ్యయం పెంచారని, ఇది ఐదు నుండి ఆరు వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి దారి తీసిందని ఆరోపించారు.
కేటీఆర్ గతంలో అన్నట్లుగా రేవంత్ రెడ్డిలో “రాము, రెమో” ఇద్దరూ ఉన్నారని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతారని, గతంలో థర్మల్ పవర్ ప్లాంట్లను “దండగ” అన్న వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక వాటినే “ముద్దు” అంటున్నారని విమర్శించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మన అనంతపురం అమ్మాయి అదుర్స్‌.. తొలి టీ 20 వరల్డ్‌ కప్‌ను అందుకున్న దీపిక

Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

బాలయ్య క్రేజ్‌ ముందు మోకరిల్లిన అవెంజర్స్‌

సినిమా హాళ్లు,అపార్ట్‌మెంట్లలోకి ఆధార్‌ ఉంటేనే ఎంట్రీ?త్వరలో కొత్త రూల్‌

పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్‌ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి