Telangana Elections: సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారా.. ఒక్కసారి ఇది చూడండి..! వీడియో

Updated on: Oct 14, 2023 | 9:09 PM

తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేసింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల్లో నవంబర్‌ 30న ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్‌ 3న ఫలితాలు ప్రకటిస్తామని సీఈసీ ప్రకటించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లయింది.

తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేసింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల్లో నవంబర్‌ 30న ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్‌ 3న ఫలితాలు ప్రకటిస్తామని సీఈసీ ప్రకటించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈసారి సోషల్‌ మీడియాపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది సీఈసీ. ఇందుకోసం ప్రత్యేక వింగ్‌ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా, నిబంధనలకు విరుద్దంగా ఓటర్లను ప్రలోభపెట్టేలా, ఇతర వర్గాలను కించపర్చేలా ఉన్న పోస్టింగ్‌లను వివిధ వెబ్‌సైట్ల ద్వారా స్కాన్ చేస్తున్నారు. తప్పుడు సమాచారం, ఎన్నికల ప్రచారం వంటి బల్క్ SMSలు చేసినా, రూమర్లను ప్రచారం చేసినా వాటిపై ఈసీ నిఘా పెట్టి కొరడా ఝళిపిస్తుంది. రాజకీయ, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై నిఘా పెట్టాలని సీఈసీ భావిస్తోంది. గూగుల్‌ సహా ఇతర సంస్థలతో ఇప్పటికే CEC చర్చలు జరిపినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్న సీఈసీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..