Pawan Kalyan: దీక్షలోనూ అధికారులతో పవన్ కార్యాదక్షత.. స్వచ్ఛాంధ్రపై డిప్యూటీ సీఎం ఫోకస్..

|

Jun 26, 2024 | 3:01 PM

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై ఏపీ మంత్రి పవన్‌ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో అధికారులతో సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ కార్యక్రమంలో సమావేశమైన ఉన్నతాధికారులు పారిశుధ్యం, పర్యావరణంపై ఫోకస్ పెట్టారు. ఇందులో చేపట్టే ఆయా కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎంకు వివరించారు. ఇందులో భాగంగా పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు కీలక సూచనలతోపాటు పలు ఆదేశాలు ఇచ్చారు.

అమరావతి, జూన్ 26: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై ఏపీ మంత్రి పవన్‌ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో అధికారులతో సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ కార్యక్రమంలో సమావేశమైన ఉన్నతాధికారులు పారిశుధ్యం, పర్యావరణంపై ఫోకస్ పెట్టారు. ఇందులో చేపట్టే ఆయా కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎంకు వివరించారు. ఇందులో భాగంగా పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు కీలక సూచనలతోపాటు పలు ఆదేశాలు ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో ఉంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ దీక్షలో భాగంగా 11 రోజుల పాటు పవన్‌ కల్యాణ్‌ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవరూపంలోని సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. గతేడాది కూడా జూన్‌ నెలలో పవన్‌ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంగా వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ మరోసారి దీక్ష చేపట్టారు. మాలధారణలోనే పవన్ తన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధికారులతో రివ్యూలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow us on