Watch Video: చంద్రబాబు అరెస్టు వెనుక వారి కుట్ర.. కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోపణలు
Andhra Pradesh News: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ పాత్ర ఉందని ఆరోపించారు. వారి కుట్రలో భాగంగానే ఏపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసిందన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ పాత్ర ఉందని ఆరోపించారు. వారి కుట్రలో భాగంగానే ఏపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసిందన్నారు. గత ఎన్నికల్లో జగన్ గెలిచేందుకు సీఎం కేసీఆర్ వందల కోట్లు ఖర్చుపెట్టారని, ఈ విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. నిందితులను అరెస్టు చేసేటప్పుడు సరైన చట్ట నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని అతిక్రమిస్తూ చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్‌కు తెలియకుండా జగన్ ఏమీ చేయరని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ మూడు ఒక్కటేనని ఆరోపించారు.
వైరల్ వీడియోలు
Latest Videos