Watch: ఎవరికైనా పదవి శాశ్వతం కాదు.. కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Updated on: Aug 30, 2025 | 12:49 PM

మొన్నటి దాకా మంత్రి పదవి కోసం.. ఆ తర్వాత.. మునుగోడు నిధుల కోసం.. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రైతుల కోసం.. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనాసరే పదవి శాశ్వతం కాదన్నారు. మంచి వ్యక్తిత్వం, సేవ చేయాలనే గుణమే శాశ్వతమన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనాసరే పదవి శాశ్వతం కాదన్నారు. మంచి వ్యక్తిత్వం, సేవ చేయాలనే గుణమే శాశ్వతమన్నారు. సేవాగుణం చచ్చేవరకూ ఉంటుంది.. కానీ, పదవి మాత్రం ఉండదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

నల్లగొండ రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి రూటే సపరేటు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. తాను ప్రజల పక్షమే అంటున్నారు. ఈ మధ్య కాలంలో సొంత పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మంత్రి పదవి హామీ ఇచ్చి మోసం చేశారంటూ.. ఏకంగా సీఎంనే విమర్శించారు. మునుగోడుకు నిధులు ఇవ్వడం లేదని బహిరంగంగానే విమర్శలు గుప్పించిన రాజగోపాల్ రెడ్డి.. రీజినల్ రింగ్‌ రోడ్డు రైతుల పక్షాన నిలబడేందుకు సిద్ధమన్నారు.

Published on: Aug 30, 2025 12:47 PM