కామారెడ్డి జిల్లా టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి చేసిన.. కాంగ్రెస్‌ లీడర్ భీంరెడ్డి.

|

Aug 01, 2023 | 9:03 AM

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ శివారులో టోల్ గేట్ సిబ్బందిపై కాంగ్రెస్ నేత భీంరెడ్డి దాడి చేశారు. భీంరెడ్డికి సంబంధించిన వ్యక్తి వెంకట్ రెడ్డి.. కామారెడ్డి నుంచి బిక్కనూర్ వైపు వెళ్తున్న సమయంలో టోల్ గేట్ వద్ద ఫాస్ట్ టాగ్ ద్వారా 90 రూపాయలు ఆటోమేటిక్‌గా కట్ అయ్యింది. వెంకట్ రెడ్డి దీనిపై భీంరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో.. తనవాళ్ల దగ్గరే టోల్ వసూలు చేస్తారా అంటూ భీంరెడ్డి అక్కడకు వచ్చి టోల్‌గేట్ సిబ్బందిపై దాడికి దిగారు.

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ శివారులో టోల్ గేట్ సిబ్బందిపై కాంగ్రెస్ నేత భీంరెడ్డి దాడి చేశారు. భీంరెడ్డికి సంబంధించిన వ్యక్తి వెంకట్ రెడ్డి……. కామారెడ్డి నుంచి బిక్కనూర్ వైపు వెళ్తున్న సమయంలో టోల్ గేట్ వద్ద ఫాస్ట్ టాగ్ ద్వారా 90 రూపాయలు ఆటోమేటిక్‌గా కట్ అయ్యింది. వెంకట్ రెడ్డి దీనిపై భీంరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో.. తనవాళ్ల దగ్గరే టోల్ వసూలు చేస్తారా అంటూ భీంరెడ్డి అక్కడకు వచ్చి టోల్‌గేట్ సిబ్బందిపై దాడికి దిగారు. మద్యం మత్తులో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించారు. దాదాపు అరగంట పాటు టోల్ ప్లాజా వద్ద వాహనాల నుంచి టోల్ వసూలు చేయకుండా అడ్డుకుని నానా హంగామా సృష్టించారు. విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. భీంరెడ్డిని ఆపే ప్రయత్నం చేశారు. ఐతే.. అతను తగ్గలేదు. వాళ్లతోనూ వాగ్వాదానికి దిగారు. దాడికి పాల్పడ్డ భీంరెడ్డితోపాటు వెంకట్ రెడ్డిపైన స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు టోల్‌ప్లాజా సిబ్బంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...