Watch: ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం – మహేశ్వర్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం (ఆగస్టు 30)నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేఎల్పీ సమావేశం శుక్రవారంనాడు జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం (ఆగస్టు 30)నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు తెలంగాణ బీజేఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి..ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతిపై రేవంత్ ప్రభుత్వం విచారణ జరిపించడం లేదన్నారు. వరద బాధితులకు ఇంకా సాయం అందడం లేదని ఆరోపించారు.