CM YS Jagan Speech LIVE: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం.. (లైవ్)
Global Investors Summit in Visakhapatnam Live: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు విశాఖపట్నం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే సదస్సు ప్రారంభంకానుంది. ఇవాళ, రేపు జరిగే ఈ సమ్మిట్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు విశాఖపట్నం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే సదస్సు ప్రారంభంకానుంది. ఇవాళ, రేపు జరిగే ఈ సమ్మిట్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. దేశ విదేశాల నుంచి రాబోతున్న కార్పొరేట్ దిగ్గజాలకు కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ కార్పెట్ ఆహ్వానం పలుకుతోంది. రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌కి సర్వసిద్ధమైంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వేదికగా మరికాసేపట్లో గ్లోబల్ సమ్మిట్ మొదలుకానుంది. ఈ సమ్మిట్ కు 25 దేశాల నుంచి హైకమిషనర్లు, 15వేల మంది ప్రతినిధులు. ఇండియా నుంచి 35మంది టాప్ ఇండస్ట్రియలిస్ట్‌లు, బిజినెస్ టైకూన్స్, కార్పొరేట్ దిగ్గజాలు. ఏడుగురు కేంద్ర మంత్రులు, వీవీఐపీలు.. ఇదీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌కు హాజరయ్యే టాప్ లిస్ట్. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి వస్తోన్న అతిథుల కోసం టాప్ లెవల్‌లో అరేంజ్‌మెంట్స్ చేసింది ఏపీ ప్రభుత్వం. దేశ విదేశీ పారిశ్రామిక దిగ్గజాలతోపాటు కేంద్ర మంత్రులు, వీవీఐపీలు వస్తుండటంతో సెక్యూరిటీపరంగానూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సుమారు 7వేల మంది పోలీసులతో నగరమంతటా మోహరించింది. ఇక, అతిథుల కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను సిద్ధంగా ఉంచింది ప్రభుత్వం. ప్రముఖ హోటళ్లలో 1500లకు పైగా షూట్స్‌ని బుక్ చేసింది ప్రభుత్వం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..