ఒలింపిక్స్‌లో గోల్డ్ గెలిస్తే రూ. 3 కోట్లు.. బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టాలిన్… ( వీడియో )

|

Jun 29, 2021 | 12:20 AM

జూలై నెలలో జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్ జులై 23న ప్రారంభమై ఆగస్టు 8న ముగియనున్నాయి.

జూలై నెలలో జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్ జులై 23న ప్రారంభమై ఆగస్టు 8న ముగియనున్నాయి. ఈ క్రీడల్లో భారత బృందం కూడా పాల్గొననుంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల‌కు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం బంపర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలిచే భారత అథ్లెట్లకు ఒక్కొక్కరికి రూ.3 కోట్ల నజరానా ఇస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం వెల్లడించారు. రజత పతక విజేతలకు రూ.2 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ.1 కోటి అందిస్తామని స్టాలిన్ పేర్కొన్నారు.

 

మరిన్ని  ఇక్కడ చూడండి: Realme 5G: అతి తక్కువ ధరలో రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంఛ్… ఎప్పుడంటే…?? ( వీడియో )

Allu Arjun: రామ్‌ చరణ్ దారిలో అల్లు అర్జున్‌… అంధుడి పాత్రలో కనిపించనున్న బన్నీ.. ( వీడియో )

Follow us on