CM Revanth Reddy: సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Updated on: Apr 09, 2025 | 4:22 PM

ఇటీవల గుజరాత్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. సబర్మతీ ఆశ్రమంలో సాగిన మహాత్మా గాంధీ జీవన విధానం, ఆశ్రమ విశిష్టతలను అక్కడి నిర్వహకులను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు

AICC ప్రత్యేక కార్యక్రమాలు, CWC సమావేశాల కోసం ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. సబర్మతీ ఆశ్రమంలో సాగిన మహాత్మా గాంధీ జీవన విధానం, ఆశ్రమ విశిష్టతలను అక్కడి నిర్వహకులను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.అప్పట్లో మహాత్మ గాంధీ వాడిన చరఖాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ కూర్చొన్ని చరఖాన్ని తిప్పి చూశారు. తర్వాత ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు.