Telangana Talli Statue Live: ధూంధాంగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ.. ప్రత్యేకతలు ఇవే.. లైవ్ వీడియో..
తెలంగాణ సెక్రటేరియట్‌లో అంగరంగ వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది. సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
తెలంగాణ సెక్రటేరియట్‌లో అంగరంగ వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది. సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఉద్యమకారులు పలువురు అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపకల్పన చేశారు.. ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టుబొట్టుతో, తెలంగాణ పల్లె పడుచుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
తెలంగాణ తల్లి రూపమిదే..
విగ్రహం మెడలో గుండుపూసలు, హారం ఉన్నాయి. మెడకు కంటె.. ముక్కుపుడక, చెవిదిద్దులను పొందుపర్చారు.
హరిత విప్లవానికి చిహ్నం ఆకుపచ్చ చీర
చేతులకు మట్టిగాజులు
ఎడమ చేతిలో సంప్రదాయ పంటలైన జొన్న, సజ్జ, మక్క, వరి కంకులు
కుడి చేతితో ప్రజలకు అభయ హస్తం
కాళ్లకు కడియాలు, మట్టెలు
ఇక ఉద్యమాలు, ఆత్మ బలిదానాలకు సంకేతంగా పాదపీఠంలో బిగించిన పిడికిళ్లు
పాదపీఠంలో ఉన్న చేతులు తల్లిని మోస్తున్న సంకేతం
చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారలక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపకల్పన చేశారు.
లక్ష మంది మహిళల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సచివాలయ ప్రాంగణాన్ని అధికారులు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. కొత్తగా ఫౌంటెన్‌ను నిర్మించారు. విగ్రహానికి రెండువైపులా వేదికలను ఏర్పాటు చేశారు. ఒకవైపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనుండగా.. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను రచించిన కవి అందెశ్రీని, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్, రమణారెడ్డిని ప్రభుత్వం తరఫున సన్మానిస్తారు.