Watch Video: ‘ కొన్నిరోజులు పదవులు ఎంజాయ్‌ చేయండి.. ఆ తర్వాత ఏదైనా జరగొచ్చు’.. సీఎం మమత సంచలన వ్యాఖ్యలు..

|

Jun 09, 2024 | 10:43 AM

ఎన్డీఏ ప్రభుత్వంపై మమత మండిపాడ్డారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ స్థానాలు రాకపోవడంతో ఎన్డీయే కూటమిగా ఏర్పడిన జేడీయూ నితీష్, టీడీపీ చంద్రబాబుల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. జూన్ 9న సాయంత్రం ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ తరుణంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ఎన్డీఏ ప్రభుత్వంపై మమత మండిపాడ్డారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ స్థానాలు రాకపోవడంతో ఎన్డీయే కూటమిగా ఏర్పడిన జేడీయూ నితీష్, టీడీపీ చంద్రబాబుల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. జూన్ 9న సాయంత్రం ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ తరుణంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఒక్కరోజులో కూలిపోయాయంటూ సంచల వ్యాఖ్యలు చేశారు. అందుకు మోదీ ప్రభుత్వం అతీతమేమీకాదని చురకలు అంటించారు. ఎన్డీయే అనైతికంగా, అప్రజాస్వామ్యకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. త్వరలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందంటు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కొన్నిరోజులు పదవులు ఎంజాయ్‌ చేయండి.. ఆ తర్వాత ఏదైనా జరగొచ్చంటూ హెచ్చరించారు. 15రోజుల తర్వాత ఎన్డీయే ప్రభుత్వం కూలిపోవచ్చు అని జోస్యం చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on