CM KCR: దేశానికి అన్నంపెట్టే రైతుకు ఎందుకీ దుస్థితి..! ఇందులో మార్పులు తీసుకురావడానికే జాతీయ రాజకీయాలు.. కేసీఆర్.
దేశంలో మార్పులు తీసుకురావడానికే జాతీయ రాజకీయాల్లోకి వచ్చామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మరఠ్వాడ గడ్డ ఎంతో మంది మహనీయులకు జన్మనిచ్చిందన్న ఆయన.. దేశంలో ఇ
దేశంలో మార్పులు తీసుకురావడానికే జాతీయ రాజకీయాల్లోకి వచ్చామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మరఠ్వాడ గడ్డ ఎంతో మంది మహనీయులకు జన్మనిచ్చిందన్న ఆయన.. దేశంలో ఇప్పటికీ సరైన సాగునీరు, కరెంట్ లేదని అన్నారు. నాందేడ్ వేదికగా జరుగుతున్న సభలో బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. ప్రధానులు మారారు, పార్టీలు మారాయి. కానీ.. దేశ పరిస్థితులు మారలేదని మండిపడ్డారు. మహారాష్ట్రాలోనే ఎక్కువ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని.. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణలోనూ ఇంతకంటే దుర్భర పరిస్థితుల ఉండేవన్న కేసీఆర్.. రైతు సంక్షేమ రాజ్యం కోసం తెలంగాణలో ఎన్నో పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామని.. రైతులు ఏ కారణంతో మరణించిన 4 రోజుల్లోగా రూ. 5 లక్షల చెక్ అందిస్తున్నట్లు వెల్లడించారు. రైతు బీమా, రైతు బంధుతో ఆదుకుంటున్నాము.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..