CM Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం
ఆంధ్రప్రదేశ్‌లో భారీ పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతూ, అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. 2026 మార్చి 23న సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడులలో ఒకటి, 30 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు, లక్షల పరోక్ష ఉపాధిని సృష్టిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (AM/NS ఇండియా) భారీ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. సోమవారం, మార్చి 23, 2026న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం ఖరారైంది. మొత్తం రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో పూర్తి కానున్న ఈ ప్రాజెక్టు, రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కుమారస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు. 2029 నాటికి ఈ ప్లాంటును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా ?? ఈ రూల్స్ తెలుసా ??
Garikapati: గరికపాటి చెప్పిందేంటి ?? జనానికి అర్ధమైంది ఏంటి ??
జ్యోతిషం పేరుతో 58 మంది మహిళలపై అత్యాచారం