Chandrababu Naidu: చంద్రబాబు నిద్రను డిసైడ్ చేసేది ఈ ఆరా రింగే !! స్పెషల్ ఏమిటో తెలుసా ??

Edited By: Phani CH

Updated on: Nov 20, 2025 | 4:25 PM

రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ రోజులలో ప్రతి మనిషి ఆరోగ్యం గురించి పాటించాల్సిన అవసరాలను దాని అవసరతను రైతులతో పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తన ఆరోగ్య సూత్రాలను.. తన వేలికి ఉన్న రింగు చెప్పే ఆరోగ్య సూచనలను రైతులకు వివరించారు... రైతులకు కూడా అలాంటి సదుపాయాలను త్వరలో తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు కూడా ఆయన తెలిపారు.. అసలు ఇంతకీ సీఎం చంద్రబాబు తన వేలికి ఉన్న సీక్రెట్ ని ఏమని చెప్పారో చూద్దాం.

కడప జిల్లాలోని పెండ్లిమర్రి గ్రామంలో రైతులతో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చాలా ఆసక్తికర విషయాలను మాట్లాడారు.. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ , దానిని రైతులు ఉపయోగించుకోవలసిన విధానాలను ఆయన వివరించారు ఏ విధమైన పంటలు పండించాలి .. ప్రజా ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలి ఎరువులు, రసాయన పదార్థాలు లేకుండా ఏ విధమైన పంటలను పండిస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడో ఆయన తెలిపారు.. అంతేకాకుండా పాతకాలంలో ఏ విధమైన పద్ధతులను వాడి పంటలను పండించారు ఇప్పుడు ఏ విధంగా పంటలను పండిస్తున్నారని గతంలో ఎరువులు రసాయనాలతో పండించిన పంటల వలన ఆరోగ్యాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో కూడా ఆయన రైతులకు వివరించారు… అయితే మారిన టెక్నాలజీ తాను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాను అనే విషయంపై రైతులతో మాట్లాడుతూ తన వేలికి ఉన్న ఉంగరం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు… నా చేతికి ఉన్న రింగు మంత్రాల రింగు కాదని ఇది నా ఆరోగ్యం గురించి తాను ఎన్ని గంటలు నిద్రపోయాను, ఎన్ని గంటలు నిద్ర పోవాలి, నా శరీరంలో ఉన్న అలసత్వం అవన్నీ తెలుపుతుందని…. అంతేకాకుండా తన శరీరంలో ఉన్న ఎలక్ట్రికల్ డివైస్ గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు అది సెన్సార్ తో పనిచేస్తుందని ఎంత తినాలి, ఏమి తినాలి, శరీరంలో ఉన్న షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి వాటి పరిమాణం ఎంత అనే దానిని పూర్తిస్థాయి అంచనా వేసి చెబుతుందని దాని ద్వారా ప్రతిరోజు ఏ ఆహారం తీసుకోవాలి అనే దానిపై కూడా ఒక అవగాహన వస్తుందని ఆయన రైతులకు వివరించారు… రాబోయే కాలంలో ఇలాంటి సదుపాయాలను మీకు కూడా అందిస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు… రానున్న కాలంలో రాష్ట్రంలో ప్రజలు ఎవరు ఆసుపత్రులకు పరిగెత్తుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదని .. ప్రతి టెస్ట్ ఇంటి దగ్గరే చేసుకుని అవసరం అయితే మాత్రమే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరాన్ని కలుగజేసే విధంగా చర్యలు తీసుకుంటామని దీన్ని టెక్నాలజీని ఉపయోగించి ఏఐ ద్వారా ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేసే విధంగా చర్యలకు శ్రీకారం చుడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు .. మొత్తం మీద తన వేలికున్న రింగు సీక్రెట్ ను ఆయన రైతులతో పంచుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షలు ఎప్పుడంటే

వలలో చిక్కిన వయ్యారి చేప.. ఆనందంలో జాలరి

ఢిల్లీ ఎర్రకోట పేలుడు.. సూసైడ్ బాంబర్ షూలోనే ట్రిగ్గర్ ??

పైరసీకి ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటే.. ఆ పని చేయాల్సిందే..