Chandrababu – Pawan Kalyan: క్యాబినెట్‌ కూర్పుపై చంద్రబాబు కసరత్తు.. ఆ పదవే కావాలన్న పవన్‌.?

|

Jun 11, 2024 | 11:18 AM

కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే తంతు పూర్తయింది. వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ సహా 72 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ వంతు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే సమయం ఆసన్నమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే తంతు పూర్తయింది. వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ సహా 72 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ వంతు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే సమయం ఆసన్నమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్‌ 12న ఉదయం 11గంటల 27 నిముషాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది. కేసరపల్లి దగ్గర ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఎయిర్‌పోర్ట్ సమీపంలోని 11 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదుగురు ఐఏఎస్‌ అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఏపీ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్‌ పెట్టారు. ఢిల్లీ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు.. పూర్తిస్థాయి కేబినెట్ ఉండేలా కసరత్తు చేస్తున్నారు. కేబినెట్‌ కూర్పుపై ఇప్పటికే పవన్‌తో పాటు బీజేపీ నేతలతోనూ చర్చించారు. సామాజిక సమీకరణాలు, సీనియర్లు, మహిళలతో పాటు పార్టీకి నిబద్దతగా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిలోనూ పలువురికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా ఎమ్మెల్యేలు గెలవడంతో కేబినెట్‌ కూర్పు కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలో కూటమి కట్టడానికి, కూటమి విజయానికి పవన్‌ కల్యాణే కారణమని చెబుతున్న చంద్రబాబు.. ఆయనకు ఏ పదవి ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అయితే టీడీపీ వర్గాల్లో జరగుతున్న చర్చ ప్రకారం పవన్‌కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. ఒకవైపు చేతిలో పలు సినిమాలు.. మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలతో.. పవన్ కళ్యాణ్ కొత్తగా కొలువుదీరే మంత్రివర్గంలో చేరాలా.? వద్దా.? అనే డైలమాలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వంలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ ఛానల్ స్క్రోలింగ్‌లో… ఆంధ్రప్రదేశ్‌లో ఉపముఖ్యమంత్రి పదవిని జనసేనాని ఆశిస్తున్నట్టు వచ్చింది. మరోవైపు పవన్ కళ్యాణ్‌కు దాదాపుగా డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్టు టీడీపీ రాజకీయ వర్గాల్లో ఓ టాక్ నడుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్‌కు కీలకమైన శాఖలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని.. వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలు, పంచాయితీలకు సరిగ్గా నిధులు కూడా కేటాయించలేదని చంద్రబాబు, పవన్‌ పలుసార్లు చెబుతూ వచ్చారు. దీంతో హోంశాఖ, గ్రామీణాభివృద్ది శాఖలు పవన్ కళ్యాణ్‌కి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు టీడీపీ, జనసేన వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే సస్పెన్స్‌కు తెరపడుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on