Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ టీమ్.. భారీ పోలీస్ భద్రత.. సర్వత్రా ఉత్కంఠ.. (లైవ్)

|

Dec 11, 2022 | 12:12 PM

ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకోనున్నారు. 11 గంటలకు అధికారులు రానున్న నేపథ్యంలో ఆమె నివాసం దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

కేంద్ర బలగాల పర్యవేక్షణలో సీబీఐ వివరణ తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం కవిత కేసీఆర్‌ను కలుసుకున్నారు. వీరి మధ్య ఏ అంశాలపై చర్చ జరిగిందనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే సీబీఐ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఏర్పాటైన ఫ్లెక్సీలు ఆసక్తిగా మారాయి. ‘డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌ విల్‌ నెవర్‌ ఫియర్‌’ అంటూ ఫ్లెక్సీలను టీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాటు చేశారు. వీరుని కుమార్తె ఎప్పటికీ భయపడదు అనే క్యాప్షన్ తో వెలసిన బ్యానర్లు హల్ చల్ చేస్తున్నాయి.ఇదిలా ఉంటే నిజానికి కవిత సీబీఐ అధికారుల ముందు ఈ నెల 6వ తేదీనే హాజరు కావాల్సి ఉంది. కానీ ఆ రోజు కవితకు వేరే కార్యక్రమాలు ఉండటంతో.. అందుబాటులో ఉండలేనంటూ సీబీఐకి లేఖ రాశారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానంటూ లేఖ రాశారు. దీంతో ఆదివారం వివరణ తీసుకునేందుకు అధికారులు వస్తున్నారు. కవితను అధికారులు ఏం ప్రశ్నించబోతున్నారు. ఆమె వారికి ఏం వివరణ ఇవ్వబోతుందనేది ఇప్పుడు పొలిటికల్ టాక్. ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నుంచి ఆదివారం.. సీబీఐ అధికారులు వివరణ తీసుకోనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 11, 2022 10:54 AM