Watch: రేవంత్, చంద్రబాబు, మోదీ కలిసి కుట్ర.. జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో.. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. హరీష్ రావు, సంతోష్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. వారిద్దరూ రేవంత్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్‌ను బలహీనపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వారి విషయంలో కేసీఆర్, కేటీఆర్ జాగ్రత్తగా ఉండాలన్నారు.
కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. బీఆర్‌ఎస్‌లో నెలకున్న తాజా సంక్షోభంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ని అడ్డుకునేందుకు జాతీయస్థాయిలో కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ వెనుక జరుగుతున్న కుట్ర కేవలం రేవంత్ పనికాదు..ఈ కుట్ర వెనుక చంద్రబాబు, మోదీ ఉన్నారన్నారు. కేసీఆర్ ఈసారి లేస్తే తెలంగాణతో ఆగరనే భయం మోదీకి ఉందన్నారు. కేసీఆర్‌ని మానసికంగా దెబ్బకొట్టాలనే చిల్లర ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వీళ్లందరినీ తిప్పికొట్టగలిగే శక్తిసామర్థ్యాలు కేసీఆర్‌కి ఉన్నాయన్నారు. ఈ దేశానికి సేవలందించే శక్తి కేసీఆర్‌కి ఉందన్నారు.
బీఆర్ఎస్ ఆరోపణలపై బీజేపీ మాధవ్ రియాక్షన్..
కేసీఆర్‌పై రేవంత్ చేస్తున్న కుట్రలో మోదీ, బాబు ఉన్నారని బీఆర్ఎస్ చేస్తున్న కామెంట్లపై స్పందించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. బీఆర్ఎస్ ఒక దగాకోరు పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ సెంటిమెంట్‌ని బీఆర్ఎస్ దుర్వినియోగం చేసిందని విమర్శించారు. పంపకాల్లో తేడాలే ఆ పార్టీలో జరుగుతున్న కవిత ఎపిసోడ్‌కి కారణం అన్నారు. అవినీతిమయమైన పార్టీలో ఈ ఎపిసోడ్ ఓ పరాకాష్టగా పేర్కొన్నారు.
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

