Big News Big Debate: తెలంగాణ ఎన్నికలే అమిత్ షా టార్గెట్..? అసదుద్దీన్‌ సంచలన కామెంట్స్.. లైవ్ వీడియో

|

May 31, 2023 | 7:04 PM

తెలంగాణ ఎన్నికలే అమిత్‌షా టార్గెట్‌గా మారాయంటున్నాయి కాషాయం వర్గాలు. బీజేపీ నాయకులు అంటే పెద్ద విషయం కాదు.. కానీ ఇప్పుడు ఏకంగా అసదుద్దీన్‌ కూడా అంతకుమించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శంషాబాద్‌లో గృహప్రవేశానికి సిద్ధమయ్యారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఎన్నికలే అమిత్‌షా టార్గెట్‌గా మారాయంటున్నాయి కాషాయం వర్గాలు. బీజేపీ నాయకులు అంటే పెద్ద విషయం కాదు.. కానీ ఇప్పుడు ఏకంగా అసదుద్దీన్‌ కూడా అంతకుమించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శంషాబాద్‌లో గృహప్రవేశానికి సిద్ధమయ్యారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే హోంమంత్రి హైదరాబాద్లో కాపురం పెట్టినా తమకు నష్టం లేదన్న అసదుద్దీన్‌ అనూహ్యంగా బీఆర్ఎస్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. తేడా వస్తే మీకు నష్టమంటూ సంకేతాలు పంపడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. MIM చీఫ్‌ అసదుద్దీన్‌ ఇప్పుడు ఆసక్తికర అంశం బయటపెట్టారు. హైదరాబాద్‌లో అమిత్‌షా ఓ ఇల్లు నిర్మించుకున్నారంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. అమిత్‌షా వస్తే తమకు పెద్దగా వచ్చే నష్టం లేదని… కేసీఆర్‌ అలర్ట్‌ గా ఉండాలంటూ వార్నింగ్‌ ఇవ్వడమే ఆసక్తి రేపుతోంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఎంఐఎం అధినేత… జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోయేది బీఆర్‌ఎస్సే అంటున్నారు.