ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క , గేర్ మార్చాల్సిన అవసరం వచ్చింది – ఇది పార్టీ నేతలకు సీఎం జగన్ చేసిన తాజా దిశానిర్దేశం. వచ్చే ఆరు నెలల బాగా పనిచేస్తే 175కు 175 స్థానాలు గెలవడం సాధ్యమేనని స్పష్టం చేశారు. వై ఏపీ నీడ్స్ జగన్ పేరిట ప్రజల్లోకి వెళ్లాలని శ్రేణులను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై నెల రోజులు ప్రచారం చేయాలని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సమన్వయకర్తలను తెలిపారు. సర్వేలన్నీ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి. టికెట్ల విషయంలో తన నిర్ణయాన్ని గౌరవించాలని, అందరికీ టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదనే విషయాన్ని పరోక్షంగా తెలియజేశారు. టికెట్ రాని నేతలు బాధపడకూడదని, అందరూ తనకు ముఖ్యమేనని స్పష్టం చేశారు.