Big News Big Debate: అమరావతి రైతుల భారీ సభ.. వైసీపీ మినహా అన్ని పార్టీలు సపోర్ట్

|

Mar 31, 2023 | 7:18 PM

రాజధాని ఉద్యమం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. అమరావతి ఆందోళనలు 12వందల రోజులకు చేరిన సందర్భంగా మళ్లీ పార్టీలు స్వరం పెంచాయి. విపక్షాలు ఉద్యమానికి మద్దతుగా నిలిస్తే.. ఎంతకాలం చేసినా మా విధానం 3 రాజధానులే అంటోంది వైసీపీ. ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం లేదు.. కేసులు కోర్టుల్లో ఉన్నాయి. రైతులు రోడ్లపై ఉన్నారు.. వారి చుట్టూ రాజకీయ పార్టీలు మాత్రం తెగ చక్కర్లు కొడుతున్నాయి.

12వందల రోజులుగా టెంట్లు కింద ఉద్యమిస్తున్న అమరావతి రైతులు.. ఉద్యమంలో భాగంగా మరోసారి భారీ సభ నిర్వహించారు. YCP మినహా పార్టీలన్నీ మద్దతు తెలిపారు. 1200 రోజులు కాదు… 12లక్షల సంవత్సరాలు చేసినా మా విదానం వికేంద్రీకరణే అంటోంది వైసీపీ. స్పాన్సర్డ్‌ ఉద్యమాలు ఎన్ని రోజులైనా చేయవచ్చంటున్నారు ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు వికేంద్రీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు.

ఉద్యమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు తిరిగివస్తుండగా మందడం వద్ద జరిగిన ఘర్షణ ఒక్కసారిగా కలకలం రేపింది. బీజేపీ నేతలు సత్యకుమార్‌, ఆదినారాయణ రెడ్డి వస్తున్న వాహనంపై దాడి చేసిన కొందరు దుండగులు వాహనాలను ద్వంసం చేశారు. తన పై జరిగిన దాడిలో వైసీపీ నాయకుల హస్తం ఉందని సత్యకుమార్ ఆరోపిస్తుంటే… ఆ అవసరం తమకు లేదంటున్నారు సజ్జల.

Published on: Mar 31, 2023 07:16 PM