Big News Big Debate: కమలంలో కలహాలు..! తెలంగాణలో బీజేపీ సతమతం..(లైవ్)
తెలంగాణలో అధికారమే లక్ష్యం అంటున్న భారతీయ జనతా పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతోంది. పార్టీలో మూడు వర్గాలుగా విడిపోయిన నాయకులు పరస్పర విమర్శలు, ట్వీట్లతో వీధికెక్కుతున్నారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత తెలంగాణ పార్టీలో అలజడి మొదలైంది.
తెలంగాణలో అధికారమే లక్ష్యం అంటున్న భారతీయ జనతా పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతోంది. పార్టీలో మూడు వర్గాలుగా విడిపోయిన నాయకులు పరస్పర విమర్శలు, ట్వీట్లతో వీధికెక్కుతున్నారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత తెలంగాణ పార్టీలో అలజడి మొదలైంది. బండి సంజయ్‌ను మారుస్తారంటూ ప్రచారం జోరందుకుంది. ఆయనకు జాతీయ స్థాయిలో పదవి కట్టబెట్టి… రాష్ట్ర బాధ్యతలు కిషన్‌రెడ్డికి ఇస్తారని ఊహాగానాలున్నాయి. ఈటల రాజేందర్‌కు కూడా కీలక పదవి దక్కబోతుందంటున్నారు. మరోవైపు బండి సంజయ్‌కు మద్దతుగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై కౌంటర్ ఇచ్చారు ఈటల రాజేందర్.ఈ దుమారం సర్దుమణగకపముందే రాజాసింగ్ సస్పెన్షన్‌పై విజయశాంతి ట్వీట్ కూడా కలకలం రేపింది. మొత్తానికి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనిపించే శృతిమించిన అంతర్గత ప్రజాస్వామ్య కాషాయం పార్టీలో కనిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..